![]() |
![]() |

సందీప్ కిషన్ రీసెంట్ గా తాను నటించిన "ఊరి పేరు భైరవ కోన" మూవీ ప్రమోషన్లలో భాగంగా కుమారీ ఆంటీ ఫుడ్ స్టాల్ కి వచ్చారు. ఆయనతో పాటు హీరోయిన్ వర్ష బొల్లమ్మ కూడా అక్కడకు వచ్చి భోజనం చేశారు. భోజనం చేసి ఆమె చేతిలో పదివేలు పెట్టాడట సందీప్ కిషన్. ఈ విషయాన్ని కుమారి ఆంటీ ఒక ఇంటర్వ్యూలో చెప్పింది.. ట్రాఫిక్‌కు ఇబ్బంది కలిగిస్తున్నారంటూ పోలీసులు కుమారీ ఆంటీ స్టాల్ పై కేసు పెట్టినప్పుడు సందీప్ కిషన్ ఆమెను సపోర్ట్ చేస్తూ ట్వీట్ చేశాడు.
తర్వాత ఆమె ఫుడ్ స్టాల్‌ను రీఓపెన్ చేయించాక సీఎం రేవంత్ రెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు చెప్పాడు సందీప్ కిషన్. సోషల్ మీడియాలో ఫుల్ ఫేమస్ ఐన కుమారీ ఆంటీ చేతి వంట రుచి చూసేందుకు ఎగబడుతున్నారు. ఐతే ఈమెను చాలామంది ఇంటర్వ్యూ చేస్తున్నారు. రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడిన కుమారి ఆంటీ దగ్గర టాలీవుడ్ సెలబ్రిటీలు కూడా కర్రీస్ తీసుకెళ్లారని చెప్పింది . ఆలీ గారు కర్రీస్ తీసుకెళ్లారని, జూనియర్ ఎన్టీఆర్ గారు వాళ్ళ డ్రైవర్ ని పంపి కర్రీస్ పట్టుకెళ్లారు. మా టీవీ సీరియల్స్ వాళ్ళు ఎక్కువగా వస్తారని చెప్పింది. కరోనా టైంలో వాళ్ళ ఊరిలో చిక్కుబడిపోయి అక్కడ కూరగాయలు అమ్ముకున్నట్లు చెప్పింది. సాఫ్ట్ వేర్ ఎంప్లాయిస్ కూడా బిజినెస్ స్టార్టింగ్ లో చాలా హెల్ప్ చేసినట్లు చెప్పింది. అలాగే వాళ్ళ ఇంట్లో అందరి దేవుళ్లను కొలుస్తామని..ఒంట్లో బాగోలేనప్పుడు సెలవు పెట్టుకుని పెద్దమ్మ తల్లి టెంపుల్ కి వెళ్తామని చెప్పింది కుమార్ ఆంటీ. అలాగే హోటల్ పెట్టక ముందు ప్రముఖ సింగర్ హేమ చంద్ర ఇంట్లో వంట మనిషిగా చేశానని అప్పటి విషయాలను గుర్తుకు తెచ్చుకుంది. ఇక సందీప్ కిషన్ లేటెస్ట్ మూవీ ఈనెల 9 న రిలీజ్ కాబోతోంది. దీంతో అన్ని వేదికలను బాగా యూజ్ చేసుకుంటూ మూవీ ప్రొమోషన్స్ చేస్తున్నాడు సందీప్ కిషన్...
![]() |
![]() |